Revanth Reddy: రేవంత్ రెడ్డి తనకు తానుగా లొంగిపోయారు: మాదాపూర్ డీసీపీ

Revant reddy surrender himself
  • లొంగిపోయిన తరువాతే న్యాయమూర్తి ముందుకు
  • ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు
  • కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా కేసులో నిందితుడే
మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి తనంతట తానుగానే వచ్చి లొంగిపోయారని మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వరరావు వెల్లడించారు. లొంగిపోయిన రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి, తాము న్యాయమూర్తి ముందు హాజరుపరిచామని స్పష్టం చేశారు. ఐపీసీలోని సెక్షన్‌ 188, 287, 109, 120 బి, 11 ఏలతో పాటు ఎయిర్‌ క్రాఫ్ట్‌ చట్టం 5 ఏ ప్రకారం ఆయనపై కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. ఇదే కేసులో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి కూడా నిందితుడేనని అన్నారు. కాగా, విశ్వేశ్వర్ రెడ్డి గాయపడివున్న కారణంగా ఆయన్ను ఇంకా అరెస్టు చేయలేదని సమాచారం.
Revanth Reddy
Arrest
Madapur
Police

More Telugu News