Pawan Kalyan: పొత్తూరి మరణం పాత్రికేయ లోకానికి తీరని లోటు: పవన్​ కల్యాణ్​

 Pawan kalyan  express grief about pothuri demise
  • తెలుగు పాత్రికేయ రంగంలో శిఖర సమానులు పొత్తూరి  
  • పొత్తూరి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి
  • ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి

ప్రముఖ పత్రికా సంపాదకుడు పొత్తూరి వెంకటేశ్వరరావు మృతిపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పత్రికా సంపాదకుడిగా ఆ స్థాయికి వన్నె చేకూర్చిన పొత్తూరి మృతి వార్త తెలిసి బాధ కలిగిందని అన్నారు. తెలుగు పాత్రికేయ రంగంలో శిఖర సమానులైన పొత్తూరి మరణం పాత్రికేయ లోకానికి తీరని లోటుగా అభివర్ణించారు. పొత్తూరి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. 


ఐదు దశాబ్దాలకు పైగా తెలుగు పత్రికా రంగానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రెస్ అకాడమీ ఛైర్మన్ గా విశిష్ట సేవలందించారని కొనియాడారు. తెలుగు భాష, సాహిత్యాలపై సాధికారత ఉన్న పొత్తూరి, రాజకీయ, సామాజిక అంశాలపై లోతైన విశ్లేషణలు చేసేవారని, ఆయన రాసిన వ్యాసాలు సరళమైన భాషలో సూటిగా ఉండేవని ప్రశంసించారు. సామాన్యులకు సైతం అర్థమయ్యే భాషలో ఆధ్యాత్మిక రచనలు చేశారని, వర్ధమాన పాత్రికేయులకు పొత్తూరి శైలి మార్గదర్శనం చేస్తుందని అభిప్రాయపడుతూ ఓ ప్రకటన చేశారు. 

Pawan Kalyan
Janasena
pothuri venkateswara rao
senior journalist

More Telugu News