Tollywood: పా రంజిత్​ సినిమాలో హీరోయిన్‌గా ఐశ్వర్య రాజేశ్?

aishwarya rajesh gets major role in pa ranjith movie
  • 'వరల్డ్ ఫేవస్ లవర్‌‌'లో ఆకట్టుకున్న ఐశ్వర్య
  • పా రంజిత్‌ నిర్మాణంలో తెరకెక్కనున్న కొత్త సినిమాలో చాన్స్‌
  • ప్రస్తుతం టక్‌ జగదీశ్‌ సినిమాలో నటిస్తున్న యువ నటి
హీరోయిన్ గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకుంటున్న నటి ఐశ్వర్య రాజేశ్. తమిళంతో పాటు తెలుగులోనూ ఇప్పుడిప్పుడే బిజీగా మారుతున్న ఆమె ఇటీవల విడుదలైన ‘వరల్డ్‌ ఫేవస్‌ లవర్‌‌’ మూవీలో సువర్ణ పాత్రతో అద్భుతంగా నటించి మంచి మార్కులు కొట్టేసింది. అంతకుముందు ‘కౌసల్యా కృష్ణమూర్తి’లో క్రికెటర్‌‌ పాత్రలోనూ మెప్పించి తెలుగు ప్రేక్షకులకు చేరువైంది.

తాజాగా తమిళ్‌లో ఆమె ఓ భారీ ప్రాజెక్ట్‌లో నటించే అవకాశం దక్కించుకుందని సమాచారం. ప్రముఖ దర్శకుడు పా రంజిత్‌ నిర్మించబోయే చిత్రంలో ఐశ్వర్యను హీరోయిన్‌గా ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు సతీశ్ దర్శకత్వం వహించబోతున్నాడని సమాచారం. ఇది హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ మూవీ అని కూడా ప్రచారం జరుగుతోంది. దీనిపై చిత్ర యూనిట్‌ త్వరలోనే అధికారిక ప్రకటన చేసే చాన్సుంది. ప్రస్తుతం పలు తమిళ చిత్రాల్లో నటిస్తున్న ఐశ్వర్య.. తెలుగులో నాని సరసన 'టక్‌ జగదీశ్' మూవీలోనూ ఓ హీరోయిన్‌గా నటిస్తోంది. 
Tollywood
Tamil movie
aishwarya rajesh
pa ranjith
new movie

More Telugu News