Venkaiah Naidu: ఇది పార్లమెంటు.. బజారు కాదు: రాజ్యసభలో వెంకయ్యనాయుడు సీరియస్

This is Parliament not a bazaar says Venkaiah Naidu
  • ఢిల్లీ అల్లర్లపై చర్చకు పట్టుబట్టిన విపక్షాలు
  • నినాదాలు చేయవద్దన్న రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య
  • విపక్ష సభ్యుల ఆందోళనతో సభ రేపటికి వాయిదా
ఢిల్లీ హింసపై పార్లమెంటు ఉభయసభలు అట్టుడుకుతున్నాయి. అల్లర్లపై చర్చకు రాజ్యసభలో విపక్ష సభ్యులు పట్టుబట్టారు. రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఎంత చెప్పినా వినకుండా నినాదాలు చేస్తూ, ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో విపక్ష సభ్యులపై వెంకయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చలపై ఎలాంటి నోటీసు ఇవ్వకుండా నినాదాలు చేయడం మంచిది కాదని అన్నారు. నినాదాలు చేయొద్దని చెప్పారు. 'ఇది పార్లమెంటు... బజారు కాదు' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయినా విపక్ష సభ్యులు ఆందోళనను కొనసాగించడంతో సభను రేపటికి వాయిదా వేశారు.
Venkaiah Naidu
Rajya Sabha
Delhi Clashes

More Telugu News