James Bond: జేమ్స్ బాండ్ సినిమాపై కరోనా ప్రభావం

Bond movie No Time To Die postponed due to Corona Virus
  • ప్రపంచ వ్యాప్తంగా కరోనా కలకలం
  • జేమ్స్ బాండ్ సినిమా విడుదల వాయిదా
  • హాలీవుడ్ లో పలు షూటింగులు రద్దు
జేమ్స్ బాండ్ సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ సినిమాల కోసం సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తుంటారు. అయితే, ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం ఇప్పుడు జేమ్స్ బాండ్ పై కూడా పడింది. బాండ్ సిరీస్ లో వస్తున్న 25వ చిత్రం 'నో టైమ్ టు డై' వచ్చే నెల ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే, ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో సినిమా విడుదలను ఏకంగా ఏడు నెలల పాటు వాయిదా వేస్తున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. నవంబర్ 12న యూకేలో, నవంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తామని తెలిపింది.

మరోవైపు, కరోనా నేపథ్యంలో పలు హాలీవుడ్ సినిమాల షూటింగ్స్ వాయిదా పడ్డాయి. పలు చిత్రాల ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ఆగిపోయాయి. 'మిషన్ ఇంపాజిబుల్ 7' చిత్ర షూటింగ్ ను కొంత కాలం పాటు వాయిదా వేస్తున్నట్టు ఈ చిత్ర బృందం ప్రకటించింది.
James Bond
No Time To Die Movie
Release
Postpone
Hollywood
Corona Virus

More Telugu News