New Delhi: ఇటలీ పర్యాటకులకు ప్రైవేటు ఆసుపత్రిలో వైద్య సేవలు

virous affected italy tourists in delhi private hospital
  • కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ కావడంతో నిర్ణయం
  • దేశీయ పర్యటనకు వచ్చిన మొత్తం 21 మంది
  • వీరిలో 14 మందికి వైరస్‌
భారతదేశం అందాలు చూద్దామని వచ్చిన ఇటలీ పర్యాటకులు ఆనుకోని ఆటంకాల్లో చిక్కుకున్నారు. మొత్తం 21 మంది సందర్శకులు రాగా వీరిలో 14 మందికి కరోనా వైరస్‌ ఉందని నిర్ధారణ కావడంతో భారత అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఢిల్లీలోని ఐటీబీపీ కేంద్రానికి తరలించి ప్రత్యేక చికిత్స అందించారు. తాజాగా వీరిని మెడాంటా వైద్యశాలకు తరలించారు.

‘ప్రభుత్వం ప్రత్యేక విజ్ఞప్తి చేయడంతో ఇటలీ బాధితులను ఆసుపత్రిలో చేర్చుకున్నాం’ అని ఆసుపత్రి యాజమాన్యం ప్రకటన విడుదల చేసింది. బాధితుల కోసం ‘క్వారెంటైన్  ఫ్లోర్‌’ ఏర్పాటుచేసి వీరికి ప్రత్యేకంగా అందులో చికిత్స అందజేస్తున్నట్లు తెలిపారు.
New Delhi
Corona Virus
Italy tourists
private hospital

More Telugu News