Nikhil: తాతయ్య అల్లు అరవింద్‌ బుగ్గలు లాగి, ముద్దు పెట్టుకున్న బన్నీ కూతురు అర్హ.. వీడియో ఇదిగో

Actor Nikhil shares Allu Arhas cutest video with Allu Aravind
  • క్యూట్ వీడియో పోస్ట్ చేసిన నిఖిల్
  • '18 పేజీస్‌' షూటింగ్‌ ప్రారంభం
  • పూజా కార్యక్రమానికి వచ్చిన అల్లు అరవింద్‌, అర్హ
  • 'ఆమె మా చీఫ్‌ గెఫ్ట్.. స్పెషల్ గెస్ట్‌' అన్న నిఖిల్
టాలీవుడ్‌ యంగ్‌ హీరో నిఖిల్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ క్యూట్ వీడియోను పోస్ట్ చేశారు. ఆయన కొత్త సినిమా '18 పేజీస్‌' షూటింగ్‌ ప్రారంభమైంది. ఈ సినిమా కథను సుకుమార్‌ అందించారు. హైదరాబాద్‌లో జరిగిన సినిమా ప్రారంభ పూజా కార్యక్రమంలో అల్లు అరవింద్‌ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తన మనవరాలు (బన్నీ కూతురు) అర్హను కూడా అల్లు అరవింద్ తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 'నువ్వు నన్నేం చేస్తావో చూడాలని ఉందట.. ఒక్క సారి చూపించు వాళ్లకి' అని అల్లు అరవింద్‌ ఆమెను అడగ్గా, తన తాత బుగ్గలు లాగి ముద్దు పెట్టుకుంది.
                 
ఈ వీడియోను పోస్ట్ చేసిన నిఖిల్‌.. 'ఆమె మా చీఫ్‌ గెఫ్ట్.. స్పెషల్ గెస్ట్‌' అని వ్యాఖ్యానించాడు. ఈ సినిమా అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 ఆర్ట్స్‌ పతాకంపై బన్నీవాస్‌ నిర్మాతగా రూపుదిద్దుకుంటుంది.  చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. '18 పేజీస్‌' టైటిల్‌ పోస్టర్‌ను నిఖిల్‌ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.
గతంలో వచ్చిన 'కార్తికేయ'కు సీక్వెల్‌గా '18 పేజీస్‌' రూపుదిద్దుకుంటుంది.
Nikhil
Tollywood
sukumar
Allu Arjun
Viral Videos

More Telugu News