Ajith: అజిత్ తో తలపడనున్న నవీన్ చంద్ర

Valimai Movie
  • హీరోగా పరిచయమైన నవీన్ చంద్ర
  • సక్సెస్ లు లేని కారణంగా తగ్గిన అవకాశాలు 
  • విలన్ గాను లభించిన మంచి ఛాన్స్ 

'అందాల రాక్షసి' సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నవీన్ చంద్ర, 'త్రిపుర' వంటి సినిమాలతో మరింత మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తరువాత  ఆయన కథానాయకుడిగా చేసిన సినిమాలు అంతగా ఆడలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన ముఖ్యమైన పాత్రలను కూడా చేస్తూ వెళుతున్నాడు. తన పాత్రకి ప్రాధాన్యత వుందనిపిస్తే, ప్రతినాయకుడిగా కూడా చేస్తున్నాడు.

అలా ఆయన ఒక తమిళ సినిమాలో ప్రతినాయకుడిగా నటించడానికి సిద్ధమవుతున్నాడు. ఆయన తలపడే హీరో ఎవరో కాదు, తమిళ స్టార్ హీరో అజిత్. వినోద్ దర్శకత్వంలో అజిత్ హీరోగా 'వలిమై' రూపొందుతోంది. ఈ సినిమాలో విలన్ పాత్రకి కార్తికేయను సంప్రదిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆ తరువాత నవదీప్ పేరు కూడా వినిపించింది. చివరికి నవీన్ చంద్రను ఖరారు చేశారనేది తాజా సమాచారం. మొత్తానికి నవీన్ చంద్ర మంచి చాన్స్ పట్టేశాడు.

  • Loading...

More Telugu News