Donald Trump: కరోనా విజృంభణ వల్ల కొన్ని వారాలుగా నేను నా ముఖాన్ని తాకలేదు: ట్రంప్

trump on corona virus
  • శ్వేతసౌధంలో కరోనాపై ట్రంప్ సమీక్ష
  • కరోనా విజృంభణ వల్ల జాగ్రత్తలు తీసుకుంటున్నానన్న ట్రంప్
  • తన ముఖాన్ని తాను తాకడాన్ని చాలా మిస్సవుతున్నానని సరదా వ్యాఖ్య
  • ప్రజలు మాస్కులను వైద్య సిబ్బంది కోసం ఆదా చేయాలన్న ఒబామా 
కరోనా విజృంభణ వల్ల తీసుకుంటున్న జాగ్రత్తల్లో భాగంగా తాను కొన్ని వారాలుగా తన ముఖాన్ని తాకలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరదాగా వ్యాఖ్యానించారు. ఇలా తన ముఖాన్ని తాను తాకడాన్ని చాలా మిస్సవుతున్నానని చెప్పుకొచ్చారు. శ్వేతసౌధంలో కరోనా వ్యాపించకుండా తీసుకొంటున్న చర్యలపై ట్రంప్‌ తమ అధికారులతో ఓ సమీక్ష సమావేశంలో నిర్వహించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

కాగా, కరోనా విజృంభణపై అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా కూడా స్పందిస్తూ ప్రజలకు పలు సూచనలు చేశారు. ప్రజలంతా ముందు జాగ్రత్త చర్యగా చేతులను శుభ్రం చేసుకోవాలని ఆయన ట్వీట్ చేశారు. ప్రజలు మాస్కులను ధరించవద్దని, వాటి కొరత ఉన్న కారణంగా వాటిని వైద్య సిబ్బంది కోసం ఆదా చేయాలని తెలిపారు. వైద్యుల సలహాలు పాటించాలని తెలిపారు. 
Donald Trump
Corona Virus

More Telugu News