Tamannaah: సమంత పొగడ్తలపై స్పందించిన తమన్నా!

Samanta Wished Tamannah
  • మిల్కీ బ్యూటీ కెరీర్ కు 15 ఏళ్లు
  • ప్రత్యేక విషెస్ చెప్పిన సమంత
  • 'నువ్వే నాకు స్ఫూర్తి' అంటూ తమన్నా సమాధానం
మిల్కీ బ్యూటీ తమన్నా వెండితెరకు పరిచయమై 15 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా హీరోయిన్ సమంత స్పెషల్ విషెస్ చెప్పింది. తొలుత బాలీవుడ్ కు పరిచయమైన తమన్నా, దక్షిణాది చిత్రాల ద్వారా అసంఖ్యాకమైన అభిమానులను సంపాదించుకుంది. నిన్నటితో ఆమె సినీ కెరీర్ 15 సంవత్సరాలు నిండి 16వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది.

ఈ సందర్భంగా "15 అద్భుతమైన సంవత్సరాలు. అందం, కష్టించేతత్వం, నిజాయితీ ఉన్న అతికొద్ది మంది వ్యక్తుల్లో తమన్నా ఒకరు. స్క్రీన్‌ పై ఆమె ఓ టపాకాయే. ఆమె నుంచి మీ చూపును తిప్పుకోలేరు. కంగ్రాట్స్ డార్లింగ్" అని ట్వీట్ చేసింది.

ఇక ఈ ట్వీట్ పై స్పందించిన తమన్నా, "సమంతా... ప్రతి పనిలోనూ నువ్వే నాకు స్ఫూర్తి. నువ్వు క్యారెక్టర్స్ ను ఎంచుకునే విధానం, వాటిని పోషించే తీరు నాకెంతో స్ఫూర్తి" అని సమాధానం ఇచ్చింది.
Tamannaah
Samantha
Career

More Telugu News