Jayeshranjan: మొత్తం ‘మైండ్​ స్పేస్​’ అంతా ఖాళీ అయిందన్నది అసత్య ప్రచారం: జయేశ్​ రంజన్​

Jayesh Ranjan reacts on corona virus rumours
  •  మైండ్ స్పేస్ లోని బిల్డింగ్ నెంబర్ 20 లోని తొమ్మిదో ఫ్లోర్ లో డీఎస్ఎం వుంది
  • అందులోని ఉద్యోగులను మాత్రమే పంపించివేశారు 
  • అన్ని కార్యాలయాలు యథాతథంగా నడుస్తాయి
హైదరాబాద్ లోని డీఎస్ఎం కంపెనీ ఉద్యోగికి కరోనా వైరస్ సోకిందన్న కారణంగా హైటెక్ సిటీ ప్రాంతంలోని రహేజా మైండ్ స్పేస్ మొత్తం ఖాళీ అయిందన్న వార్తలపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ స్పందించారు.

హైదరాబాద్ లో  ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మైండ్ స్పేస్ లోని బిల్డింగ్ నెంబర్ 20 లోని తొమ్మిదో ఫ్లోర్ లో డీఎస్ఎం కంపెనీ ఉందని, అక్కడి ఉద్యోగులను మాత్రమే ఈ రోజు ఇంటికి పంపారని చెప్పారు. అంతే తప్ప ‘మైండ్ స్పేస్’లో ఉన్న అన్ని బిల్డింగ్ లు ఖాళీ అయిపోతున్నాయంటూ అసత్య ప్రచారం జరిగిందని చెప్పారు. రేపటి నుంచి ‘మైండ్ స్పేస్’లోని అన్ని కార్యాలయాలు యథాతథంగా నడుస్తాయని స్పష్టం చేశారు.
Jayeshranjan
Telangana
IT
Industries
Secretary

More Telugu News