E.V.V. SathyaNarayana: నా కోసం ఈవీవీ ఓ పెద్ద హీరో సినిమాను వదిలేశాడు: సంగీత దర్శకుడు కోటి

Gopal Reddy Movie
  • ఈవీవీతో ఎంతో అనుబంధం ఉండేది
  • ఆ నిర్మాత అలా చేయడం ఆయనకి నచ్చలేదు
  • తన కోసం బయటికి వచ్చేశారన్న కోటి  
తెలుగు సినిమా సంగీతాన్ని పరుగులు తీయించిన సంగీత దర్శకుడిగా కోటి కనిపిస్తారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలకు ఆయన పనిచేశారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, చాలాకాలం క్రితం జరిగిన ఒక సంఘటన గురించి ప్రస్తావించారు.

"బాలకృష్ణతో ఎస్.గోపాల్ రెడ్డిగారు ఒక సినిమాను నిర్మించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఆ సినిమాకి దర్శకుడిగా ఈవీవీ సత్యనారాయణను తీసుకున్నారు. సంగీత దర్శకుడిగా నన్ను తీసుకోమని గోపాల్ రెడ్డిగారికి ఈవీవీ చెప్పారు. అయితే ఆయన నన్ను సంప్రదించకుండానే, మరో సంగీత దర్శకుడిని తీసుకున్నారు. ఆ సంగీత దర్శకుడిని చూసిన ఈవీవీ ఆశ్చర్యపోయారు. 'కోటి'ని తీసుకోకపోతే తను కూడా ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నట్టుగా చెప్పేసి వచ్చారు. అలా నా కోసం ఈవీవీ ఆ సినిమాతో పాటు, మరో రెండు సినిమాలను కూడా వదులుకున్నారు. అప్పట్లో నాకు ఆయనకి మధ్య అనుబంధం అలా ఉండేది" అని చెప్పుకొచ్చారు.
E.V.V. SathyaNarayana
Koti
Gopal Reddy

More Telugu News