Rahul Gandhi: మరోసారి ఆ మాటెత్తొద్దు: పార్టీ సీనియర్ నేతలకు రాహుల్ గాంధీ క్లాస్

No Question Rahul Gandhi Said On Return As Congress Chief
  • పార్టీ చీఫ్ పదవిపై ప్రశ్నలు అడగొద్దని సూచన
  • మధ్యప్రదేశ్ సంక్షోభం నేపథ్యంలో ప్రస్తావించిన నేతలు
  • అయినా స్పందించని రాహుల్ గాంధీ
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి సంబంధించి మరోసారి ప్రశ్నించవద్దని రాహుల్ గాంధీ ఆ పార్టీ సీనియర్ నేతలకు స్పష్టం చేసినట్టు తెలిసింది. తాను ఇప్పటికే రాజీనామా చేశానని, తన ఉద్దేశం ఏమిటో స్పష్టంగానే చెప్పేశానని ఆయన పేర్కొన్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ సర్కారు సంక్షోభంలో పడిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్ష పదవి అంశం ప్రస్తావనకు వచ్చినట్టు కాంగ్రెస్ వర్గాలు చెప్పాయి. వారిని ఉటంకిస్తూ ఆంగ్ల మీడియా దీనిపై కథనం ప్రచురించింది.

ముందుగానే స్పష్టం చేశాను

‘‘మళ్లీ పదవి చేపట్టడంపై ఎలాంటి ప్రశ్నలూ వేయవద్దు. లీడర్ షిప్ విషయంపై నేను స్పష్టమైన నిర్ణయం తీసుకున్నాను. నా ఉద్దేశం ఏమిటన్నది నేను ఇంతకు ముందు రాసిన లేఖలోనే స్పష్టంగా వివరించాను. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మళ్లీ పదవి చేపట్టే అంశంపై ఎలాంటి ప్రశ్నలూ వేయవద్దు” అని రాహుల్ గాంధీ స్పష్టం చేసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
Rahul Gandhi
Congress
Sonia Gandhi

More Telugu News