కరోనా నేపథ్యంలో.. మంచి నిర్ణయం తీసుకున్నారు డియర్ 'పీఎం సాబ్': నాగబాబు
- కరోనా నేపథ్యంలో హోలీ వేడుకలకు మోదీ దూరం
- స్పందించిన నాగబాబు
- మోదీ ట్వీట్‌కు కామెంట్
మోదీ నిర్ణయంపై సినీ నటుడు, జనసేన నేత నాగబాబు స్పందిస్తూ.. కామెంట్ చేశారు. 'మంచి నిర్ణయం డియర్ పీఎం సాబ్' అని అన్నారు. కాగా, పవన్ కల్యాణ్ కొత్త సినిమా పేరు 'వకీల్ సాబ్' అని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే 'పీఎం సాబ్' అంటూ నాగబాబు కామెంట్ చేశారు. కొన్ని రోజుల నుంచి మోదీ నిర్ణయాలపై ప్రశంసలు గుప్పిస్తూ నాగబాటు ట్వీట్లు చేస్తున్నారు.