Nadendla Manohar: అందుకే బీజేపీతో కలిశాం.. ఉగాది నుంచి టీడీపీతో కలిసి పోరాటం: జనసేన నేత నాదెండ్ల కీలక ప్రకటన

will go with tdp nadendla
  • ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలు, అభివృద్ధి కోసమే పోరాటం
  • ఏపీలో ఒక్క అభివృద్ధి పనీ జరగలేదు
  • రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ పనులు 
  • రాష్ట్ర రెవెన్యూ పడిపోయింది
ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలు, అభివృద్ధి కోసమే తమ పార్టీ బీజేపీతో కలిసి పనిచేస్తోందని జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. ఉగాది నుంచి జనసేన, టీడీపీ కలిసి ప్రజా సమస్యలపై పోరాడతాయని ప్రకటించారు.

ఏపీలో జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క అభివృద్ధి పనీ జరగలేదని జనసేన నేత నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ప్రభుత్వ కార్యాలయాల రంగులు మార్చుతూ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

రాష్ట్రంలో రివర్స్‌ టెండర్ల పేర్లతో అభివృద్ధిని అడ్డుకుంటున్నారని నాదెండ్ల మనోహర్ చెప్పారు. రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ ఇటువంటి పనులకు పాల్పడుతోందని విమర్శించారు. రాష్ట్ర రెవెన్యూ పడిపోయిందని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన తప్పులనే వైసీపీ ఇప్పుడు చేస్తోందని విమర్శించారు.
Nadendla Manohar
Janasena
Telugudesam
BJP

More Telugu News