Velagapudi Ramakrishna Babu: చంద్రబాబుపై వైసీపీ నేతలు దౌర్జన్యం చేశారంటూ సీపీకి ఫిర్యాదు చేసిన వెలగపూడి రామకృష్ణబాబు

Velagapudi complains Vizag CP
  • ఇటీవల విశాఖలో చంద్రబాబును అడ్డుకున్న ఆందోళనకారులు
  • హైదరాబాద్ వెళ్లిపోయిన చంద్రబాబు
  • వైసీపీ నేతలు కుట్రపన్ని చంద్రబాబును అడ్డుకున్నారన్న వెలగపూడి
ఇటీవల చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్లినప్పుడు విశాఖలో ఆందోళనకారులు ఆయన ప్రజాచైతన్యయాత్రకు అడ్డుపడ్డారు. దాంతో చంద్రబాబు హైదరాబాద్ వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో, టీడీపీ శాసనసభ్యుడు వెలగపూడి రామకృష్ణబాబు వైసీపీ నేతలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రబాబుపై వైసీపీ నేతలు, కార్యకర్తలు దౌర్జన్యం చేశారని ఆయన విశాఖ సీపీ ఆర్కే మీనాకు తెలిపారు. వైసీపీ నేతలు కుట్రలు పన్ని చంద్రబాబును అడ్డుకున్నారని ఆరోపించారు.
Velagapudi Ramakrishna Babu
Chandrababu
YSRCP
Vizag
CP
RK Meena
Police

More Telugu News