Jogi Ramesh: టీడీపీ నేతలు ఏ బ్రాండ్లు తాగుతారో చెప్పండి... అవే ఇస్తాం: జోగి రమేశ్

Jogi Ramesh slams TDP leaders over liquor brands
  • టీడీపీ, వైసీపీ నేతల మధ్య మద్యం బ్రాండ్ల యుద్ధం
  • చవకబారు బ్రాండ్లతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని టీడీపీ ఆగ్రహం
  • చంద్రబాబు తాబేదార్లు రెచ్చిపోతున్నారంటూ జోగి రమేశ్ ఫైర్

రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మద్యం బ్రాండ్ల యుద్ధం నడుస్తోంది. కమీషన్ల కోసం కక్కుర్తిపడి చవకబారు బ్రాండ్లను విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ స్పందించారు.

టీడీపీ నేతలు ఏ బ్రాండ్లు తాగుతారో చెబితే తాము ఆ బ్రాండ్లనే సరఫరా చేస్తామని అన్నారు. లోకేశ్, బోండా ఉమ, బుద్ధా తదితరులు, వాళ్ల స్నేహితులు ఏ బ్రాండ్లు తాగుతారో ఓ జాబితా రాసివ్వాలని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఆదాయం తగ్గినా ఫర్వాలేదని, రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కోసమే జగన్ మద్యం ధరలు పెంచారని తెలిపారు. టీడీపీలో చంద్రబాబు తాబేదార్లు రెచ్చిపోతున్నారని జోగి రమేశ్ మండిపడ్డారు.

"11 గంటలకు మద్యం దుకాణం తెరిచి రాత్రి 8 గంటలకల్లా మూసేస్తున్నాం. మందుబాబులకు నచ్చని బ్రాండ్లు దొరక్కపోతే ఇంటికెళ్లి పడుకుంటారు. మీకెందుకు బాధ?" అంటూ టీడీపీ నేతలపై మండిపడ్డారు.

  • Loading...

More Telugu News