Revanth Reddy: 'ఓటుకు నోటు' కేసు విచారణ... ఏసీబీ కోర్టుకు హాజరైన రేవంత్ ‌రెడ్డి

revanth reddy attends in court
  • తెలుగు రాష్ట్రాల్లో 2015లో సంచలనమైన ఓటుకు నోటు కేసు
  • హాజరైన నిందితులు
  • విచారణ ఈ నెల 17కు వాయిదా
తెలుగు రాష్ట్రాల్లో 2015లో సంచలనం రేపిన ఓటుకు నోటు కేసులో ఏ1, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఈ రోజు ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. అప్పట్లో ఆయనను ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కొన్నాళ్ల పాటు ఆయన జైలులోనూ ఉన్నారు.

ఈ కేసులో విచారణ ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ కేసులో నిందితులుగా ఉన్న వారంతా ఈ రోజు ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. వాదనలు విన్న న్యాయస్థానం ఈ కేసులో తదుపరి విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది. కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తమ వైపునకు ఆకర్షించేందుకు తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌కు 50 లక్షల రూపాయలు ఇస్తూ రేవంత్‌ రెడ్డి కెమెరాకు చిక్కిన విషయం తెలిసిందే.
Revanth Reddy
Congress
Telangana
Andhra Pradesh
Telugudesam

More Telugu News