New Delhi: నేడు ప్రధాని నరేంద్రమోదీతో భేటీ కాబోతున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్

Delhi CM Arvind Kejriwal to meet PM Narendra Modi
  • సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి మోదీతో భేటీ
  • ఢిల్లీ అల్లర్ల నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యం
  • గతవారం అమిత్ షాను కలిసిన కేజ్రీవాల్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ప్రధాని నరేంద్రమోదీ నేడు భేటీ కాబోతున్నారు. ఢిల్లీ శాసనసభకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ప్రధానిని కలుసుకోవడం ఇదే తొలిసారి. ఇటీవల ఈశాన్య ఢిల్లీలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో వీరి కలయిక ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, ఢిల్లీ అల్లర్ల నేపథ్యంలో గతవారం అమిత్‌షాను కలిసిన కేజ్రీవాల్ పరిస్థితిపై చర్చించారు.
New Delhi
Arvind Kejriwal
Narendra Modi

More Telugu News