Corona Virus: కరోనా వైరస్ పై పోస్టు చేసి క్షమాపణ కోరిన చార్మీ

Charmme apologies over comments on corona virus
  • హైదరాబాదులో కరోనా ఉనికి
  • ఆల్ ది బెస్ట్ అంటూ టిక్ టాక్ వీడియో చేసిన చార్మీ
  • వైరస్ కు స్వాగతం పలుకుతున్నట్టు వ్యాఖ్యలు
  • మండిపడిన నెటిజన్లు
కరోనా వైరస్... ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ వైరస్ మహమ్మారి ఇప్పుడు తెలంగాణలోనూ ప్రత్యక్షమైంది. అందరూ ఎంతో ఆందోళన చెందుతున్న ఈ తరుణంలో సినీ నటి, నిర్మాత చార్మీ కాస్తంత వెటకారం జోడించి పోస్టు చేసి అపఖ్యాతి పాలైంది. కరోనా ఇక్కడికి కూడా వచ్చేసిందట కదా, ఆల్ ది బెస్ట్ అంటూ వైరస్ కు స్వాగతం పలుకుతున్నట్టు ఓ టిక్ టాక్ వీడియో చేసింది.

 ఇదేంటి, కరోనాకు స్వాగతం పలకడం ఏంటని నెటిజన్లు మండిపడుతూ రిప్లయ్ లు ఇవ్వడంతో వెంటనే ఆ పోస్టును తొలగించింది. కాసేపటి తర్వాత ట్విట్టర్ లో స్పందించిన చార్మీ, జరిగిన దానిపై క్షమాపణలు కోరింది. "ఆ వీడియో పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తూ పోస్టయిన అన్ని కామెంట్లు చదివాను. ఎంతో సున్నితమైన అంశంపై పరిణతి లేకుండా స్పందించినందుకు క్షమాపణలు తెలుపుకుంటున్నాను. ఇకపై ఇలాంటి పొరబాట్లు జరగకుండా జాగ్రత్త వహిస్తాను" అంటూ చార్మీ ట్వీట్ చేసింది.
Corona Virus
Charmme
Hyderabad
Tik Tok
Video
Sorry

More Telugu News