Krithi Garg: నేను మా ఇంట్లోనే ఉన్నాను: హీరోయిన్ మిస్సింగ్ ఉదంతం సుఖాంతం

Actress Krithi Garg says that she was in her home
  • కృతి గార్గ్ మిస్సింగ్ అంటూ దర్శకుడు సుబ్బు ఫిర్యాదు
  • తాను క్షేమంగానే ఉన్నానంటూ పోస్టు చేసిన కృతి
  • నెట్ వర్క్ లేక ఫోన్ పనిచేయలేదని వివరణ

టాలీవుడ్ లో రాహు అనే చిత్రంలో నటించిన కృతి గార్గ్ కనిపించడం లేదంటూ చిత్ర దర్శకుడు సుబ్బు వేదుల పోలీసులను ఆశ్రయించడం తీవ్ర కలకలం రేపింది. ప్రభాస్ పక్కన చాన్స్ అంటూ కృతికి అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా పేరుతో ఫోన్ కాల్ వచ్చిందని, దాంతో ముంబయి వెళ్లిన కృతి నుంచి ఎలాంటి స్పందన లేదని సుబ్బు ఫిర్యాదు చేశాడు.

అయితే, తన ఆచూకీ దొరకడంలేదంటూ మీడియాలో వస్తున్న కథనాలపై హీరోయిన్ కృతి గార్గ్ ఫేస్ బుక్ లో స్పందించింది. తాను ఎక్కడికీ వెళ్లలేదని, ముంబయిలో తన ఇంట్లోనే సురక్షితంగా ఉన్నానని వెల్లడించింది. నెట్ వర్క్ లేని కారణంగా ఫోన్ పనిచేయకపోవడంతో డైరెక్టర్ సుబ్బు ఆందోళనకు గురై పోలీసులకు ఫిర్యాదు చేసి ఉంటాడని వివరణ ఇచ్చింది. తన కారణంగా ఇలాంటి పరిస్థితి తలెత్తినందుకు క్షమించాలని విజ్ఞప్తి చేసింది. తనపట్ల ఇంతటి శ్రద్ధ చూపినందుకు ధన్యవాదాలు తెలిపింది.

  • Loading...

More Telugu News