టీమిండియా ఓటమిపై స్పందించిన విరాట్ కోహ్లీ
- పరిస్థితుల గురించి అతిగా ఆలోచించి తప్పు చేశాం
- బ్యాట్స్‌మెన్‌లో స్పష్టత లేకపోవడమే ముంచింది
- తప్పిదాలను సమీక్షించి నేర్చుకుంటాం
గతంలో ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో బాగా ఆడామని గుర్తు చేశాడు. అప్పుడు తామంతా ఓ స్పష్టమైన ఆలోచనా దృక్పథంతో ఉన్నామన్నాడు. ఈ సిరీస్‌లో అది లోపించిందన్నాడు. టెస్టులు ఆడుతున్నప్పుడు ప్రతి రోజు, ప్రతి సెషన్, ప్రతి పరిస్థితిలో సానుకూలంగా ఆలోచించాల్సి ఉంటుందని అన్నాడు. కానీ, తమ బ్యాటింగ్ విభాగం మొత్తం ఫెయిలైందని, తొలి టెస్టు తొలి రోజు నుంచే పరిస్థితుల గురించి ఎక్కువగా ఆలోచించి తప్పు చేశామని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. ఈ ఓటమి తమకు ఓ పాఠం లాంటిదన్నాడు. సిరీస్‌లో చేసిన తప్పిదాలను సమీక్షించుకొని.. వాటి నుంచి పాఠాలు నేర్చుకుంటామని తెలిపాడు.