Corona Virus: దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన వ్యక్తికి కరోనా లక్షణాలు

Hyderabad person who came from Dubai traced with corona
  • భారత్ లో పెరుగుతున్న కరోనా కేసులు
  • ఇటలీ నుంచి ఢిల్లీ వచ్చిన వ్యక్తికి కరోనా
  • ఇద్దరినీ పరిశీలనలో ఉంచినట్లు వెల్లడించిన కేంద్రం
భారత్ లోనూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఢిల్లీ, హైదరాబాద్ నగరాల్లోనూ కరోనా లక్షణాలతో బాధపడుతున్న వ్యక్తులను గుర్తించారు. ఇటలీ నుంచి ఢిల్లీకి వచ్చిన ఓ వ్యక్తిలో కరోనా లక్షణాలున్నట్టు వైద్యపరీక్షల్లో తేలింది. అటు, దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన మరో వ్యక్తిలోనూ ఇవే తరహా లక్షణాలు గుర్తించారు. వీరిరువురికి వైద్య పరీక్షలు నిర్వహించి పరిశీలనలో ఉంచినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇద్దరి పరిస్థితి నిలకగా ఉన్నట్టు తెలిపింది.
Corona Virus
India
Hyderabad
New Delhi
China
Covid-19

More Telugu News