Rashmi Gautam: నెటిజన్ల కామెంట్లపై మండిపడ్డ అందాల యాంకర్‌ రష్మీ

rashmi gautam People who are being negative about  the film on my wall
  • హీరోయిన్‌ తాప్సీ నటించిన తప్పడ్ సినిమా విడుదల
  • కుటుంబంతో కలిసి చూడతగిన మూవీ అని యాంకర్‌ రష్మీ ట్వీట్
  • చెత్త సినిమా అని నెటిజన్ల రిప్లై
  • సినిమాను చూసి మాట్లాడాలని ఆగ్రహం  
హీరోయిన్‌ తాప్సీ నటించిన తప్పడ్ సినిమాను చూశానని, కుటుంబంతో కలిసి చూడతగిన మూవీ అని యాంకర్‌ రష్మీ చేసిన ఓ పోస్టుపై నెటిజన్లు విమర్శలు గుప్పించారు. ఈ బాలీవుడ్‌ సినిమాపై 'బాయ్‌కాట్‌ తప్పడ్‌' అనే హ్యాష్‌ట్యాగ్‌లో నెటిజన్లు పెద్ద ఎత్తున ట్వీట్లు చేస్తున్న విషయం తెలిసిందే. పౌరసత్వ సవరణ చట్టానికి నిరసన తెలుపుతున్న వారికి ఆమె మద్దతు తెలపడంతో తాప్సీకి ఇటువంటి పరిస్థితి ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో రష్మీ ఇటువంటి పోస్టు చేయడంతో 'మేము ఆల్‌ రెడీ బాయ్‌ కాట్‌ చేశాం', 'చెత్త సినిమా' అంటూ నెటిజన్లు రిప్లై ఇస్తున్నారు.

దీంతో దీనిపై కొన్ని గంటల తర్వాత స్పందించిన రష్మీ ఆగ్రహం వ్యక్తం చేసింది. 'నా పోస్టుకి నెగిటివ్‌ కామెంట్లు చేస్తోన్న వారు అసలు నిజంగా ఈ సినిమాను చూశారా? ట్రైలర్‌ మాత్రమే చూసి, ఈ సినిమాపై ఓ అవగాహనకు వచ్చి కామెంట్లు చేస్తున్నారా??' అని మరో పోస్ట్ చేసింది.

అయితే, ఆమె మొదటి పోస్టును చూడని వారు ఈ రెండో పోస్టును చూసి.. 'నువ్వెప్పుడు సినిమాలో నటించావు? నీ కొత్త సినిమా ఏది రిలీజ్ అయింది?' అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో మరోసారి స్పందించి మూడో ట్వీట్ చేసిన రష్మీ 'నేను తప్పడ్ సినిమా గురించి పోస్ట్ చేశాను' అని చెప్పింది. ప్రేక్షకులు 'బాయ్‌కాట్‌ తప్పడ్‌' అంటున్నారన్న విషయం నీకు తెలియదా? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Rashmi Gautam
Tollywood
Bollywood

More Telugu News