రాధికను చంపింది కుటుంబ సభ్యులేనా?.. ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో నేడు వీడనున్న చిక్కుముడి!
- గత నెల 10న ఇంట్లోనే దారుణహత్యకు గురైన రాధిక
- ఆమెను హత్యచేసింది బయటి వ్యక్తులు కాదని నిర్ధారణ
- తండ్రిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన పోలీసులు
ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న రాధికను గత నెలలో దుండగులు గొంతు కోసి హత్య చేశారు. రోజు కూలీలైన ఆమె తల్లిదండ్రులు సాయంత్రం ఇంటికి వచ్చి చూసేసరికి కుమార్తె రక్తపు మడుగులో పడి ఉంది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. కేసును సీరియస్‌గా తీసుకున్న కమిషనర్ కమలాసన్ రెడ్డి 75 మంది పోలీసులుతో 8 బృందాలను ఏర్పాటు చేసి లోతుగా దర్యాప్తు చేయించారు. దీంతో ఆమెను చంపింది బయటి వ్యక్తులు కాదని తేలింది. నేడు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిందితుల పేర్లను పోలీసులు బయటపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.