Assam: పదో తరగతి విద్యార్థుల ఘాతుకం... అమ్మాయిపై అత్యాచారం చేసి ఆపై హత్య!

Boys killed girl in Assam
  • అసోంలో ఘోరం
  • పన్నెండేళ్ల అమ్మాయిపై ఏడుగురు విద్యార్థుల అత్యాచారం
  • ఆత్మహత్య చేసుకుందని నమ్మించేలా చెట్టుకు ఉరి

అసోంలోని బిశ్వనాథ్ జిల్లాలో ఏడుగురు పదో తరగతి విద్యార్థులు పన్నెండేళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడి ఆపై హతమార్చిన ఘటన తీవ్ర కలకలం రేపింది. విందు చేద్దామని బాలికను సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లిన ఆ విద్యార్థులు లైంగిక దాడికి పాల్పడ్డారు. అఘాయిత్యం గురించి ఎవరికైనా చెబుతుందేమోనని భయపడి ఆమెను హత్య చేశారు. ఆ బాలిక ఆత్మహత్య చేసుకుందని నమ్మించేలా చెట్టుకు ఉరేశారు.

బాలిక కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరు విద్యార్థులపై అనుమానంతో వెతకగా, వారిద్దరూ సమీపంలోని అటవీప్రాంతం నుంచి వస్తూ కనిపించారు. జనాన్ని చూసి వారు పరారయ్యారు. దాంతో మరింత ముందుకు వెళ్లి వెతకగా, అడవిలో బాలిక చెట్టుకు వేలాడుతున్న స్థితిలో కంటబడింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విద్యార్థుల కోసం గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News