వాట్సాప్ లో కలకలం రేపి కనిపించకుండా పోయిన ఎస్సై ఆచూకీ లభ్యం
- ఇదే నా చివరి మెసేజ్ అంటూ వాట్సాప్ లో పోస్టు చేసిన రుద్రవరం ఎస్సై
- సెల్ స్విచాఫ్ చేయడంతో తీవ్ర ఆందోళన
- సెల్ లొకేషన్ ద్వారా కడప జిల్లాలో ఉన్నట్టు గుర్తింపు
- ఇటీవలే ఎస్సైని మందలించిన ఉన్నతాధికారులు
ఈ నేపథ్యంలో, పోలీసు బృందాలు తీవ్ర గాలింపు అనంతరం ఎస్సై విష్ణు నారాయణ ఆచూకీ కనుగొన్నారు. సెల్ ఫోన్ లొకేషన్ ద్వారా ఎస్సై కడప జిల్లాలో ఉన్నట్టు గుర్తించారు. అనంతరం ఎస్సైని కుటుంబ సభ్యులతో మాట్లాడించారు. ఇటీవల ఓ వ్యవహారంలో ఎస్సై విష్ణునారాయణను ఉన్నతాధికారులు పిలిపించి మందలించారు. దాంతో మనస్తాపానికి గురైన ఆయన సెల్ స్విచాఫ్ చేసి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. దీనిపై ఆళ్లగడ్డ డీఎస్పీ సదరు ఎస్సైతో మాట్లాడి నచ్చచెప్పారు. దాంతో, విధులకు హాజరయ్యేందుకు ఎస్సై విష్ణునారాయణ సంసిద్ధత వ్యక్తం చేశారు.