Khammam: మాజీ ఎంపీ కొడుకు పెళ్లా...మజాకా : రిసెప్షన్‌కు బాహుబలి సెట్టింగ్‌లు

Bahubali settings in ex mp son reception
  • వంద ఎకరాల స్థలంలో ఏర్పాట్లు
  • లక్ష మందికి భోజన ఏర్పాట్లు
  • టీఆర్‌ఎస్‌ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో సందడి
సాధారణ వ్యక్తులే పిల్లల పెళ్లికి లక్షలు ఖర్చుచేస్తున్న రోజులివి. మరి మాజీ ఎంపీ, సీనియర్‌ రాజకీయ నాయకుడి కొడుకు పెళ్లంటే మాటలా. బాహుబలి సెట్టింగ్‌లు, భారీ ఏర్పాట్లు, లక్ష మందికి భోజన సదుసాయం... అదీ ఈ వేడుక ఘనత. ఖమ్మం మాజీ ఎంపీ, టీఆర్‌ఎస్‌ నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు హర్షారెడ్డి పెళ్లి ఇటీవల అబుదాబిలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈరోజు ఖమ్మంలోని ఎస్‌ఆర్‌ గార్డెన్స్‌ సమీపంలో రిసెప్షన్‌ జరగనుంది.

ఇందుకోసం వంద ఎకరాల విస్తీర్ణంలో బాహుబలి సెట్టింగ్‌ను తలపించే అలంకరణతో భారీ ఏర్పాట్లు చేశారు. కళాత్మక నిర్మాణాలు, వాటర్‌ఫౌంటేన్లు, షామియానాలతో అలంకరించారు. రిసెప్షన్‌ వేదిక వద్దకు వెళ్లేందుకు రఘునాథపాలెం రోడ్డులో ఆకట్టుకునేలా స్వాగత ద్వారాన్ని తీర్చిదిద్దారు.

లక్ష మందికి విందు ఇచ్చేందుకు ప్రాంగణంలో ఎనిమిది విభాగాలను ఏర్పాటు చేశారు. భోజనానికి వెళ్లివచ్చే వారి కోసం వేర్వేరు మార్గాలు ఏర్పాటు చేశారు. ఈ రిసెప్షన్‌కు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు, పొంగులేటి అభిమానులు హాజరు కానున్నారు.
Khammam
ponguleti
ex.MP
reception

More Telugu News