Team New Zealand: సేమ్ టూ సేమ్... మళ్లీ నిరాశపరిచిన కోహ్లీ... భారత స్కోరు 55/3

Indian top Order Fain in Second Innings
  • తడబడిన భారత ఆటగాళ్లు
  • 14 పరుగులకే కోహ్లీ అవుట్
  • 14 పరుగులతో ఆడుతున్న పుజారా
న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్టు, రెండో ఇన్నింగ్స్ లో భారత్ తడబడింది. టాప్ ఆర్డర్ విఫలం కావడంతో 55 పరుగులకే మూడు వికెట్లు పడ్డాయి. ఓపెనర్ పృథ్వీ షా 14 పరుగుల వద్ద ఉండగా, సౌథీ పెవీలియన్ కు పంపాడు. అంతకుముందే మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్, బౌల్ట్ బౌలింగ్ 3 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఆ తరువాత వచ్చిన కెప్టెన్ కోహ్లీ, 30 బంతులను ఎదుర్కొని 14 పరుగులు మాత్రమే చేసి, గ్రాండ్ హోమ్ బౌలింగ్ లో ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం పుజారా 14  పరుగులతో ఆడుతుండగా, అతనికి రహానే వచ్చి జత కలిశాడు. ప్రస్తుతం భారత స్కోరు 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 55 పరుగులు.
Team New Zealand
Team India
Cricket
Test

More Telugu News