Raviteja: కొత్తదనం కోసం రవితేజ కొత్త నిర్ణయం

Raviteja Movie
  • వరుస ఫ్లాపులతో రవితేజ 
  • హిట్ల కోసం ప్రయత్నాలు 
  • కామెడీ ఎంటెర్టైనర్ల వైపు మొగ్గు  
రవితేజకి మాస్ మహారాజ్ అనే పేరు వుంది. మాస్ ఆడియన్స్ కి నచ్చే అంశాలు తన కథలలో ఉండేలా చూసుకుంటూ ఆయన ఆ ఇమేజ్ ను కాపాడుకుంటూ వచ్చాడు. అయితే కొంతకాలంగా ఆయనకి పరాజయాలు ఎదురవుతూ వస్తున్నాయి. ఇటీవల ప్రయోగాత్మక చిత్రంగా వచ్చిన 'డిస్కోరాజా' సినిమా కూడా ఆయన అభిమానులను నిరాశ పరిచింది. దాంతో అయన ప్రయోగాల జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నాడు.

అంతేకాదు, ఇప్పట్లో మాస్ యాక్షన్ కథల జోలికి పోకూడదనే నిర్ణయానికి కూడా వచ్చేశాడట. ఆ మధ్య తను చేసిన 'రాజా ది గ్రేట్' కొత్తదనంతో కూడిన కామెడీ ఎంటర్టైనర్ గా విజయాన్ని సాధించింది. అలా నాన్ స్టాప్ గా అలరించే కామెడీ ఎంటర్టైనర్లనే చేయాలని భావిస్తున్నాడట. ఆ తరహా కథలతోనే తన దగ్గరికి రమ్మని దర్శకులకు చెబుతున్నాడని అంటున్నారు. రవితేజ తీసుకున్న కొత్త నిర్ణయం ఆయనకి హిట్లు తెచ్చి పెడుతుందేమో చూడాలి.
Raviteja
Disco Raja
Tollywood

More Telugu News