Guntur District: రెండు గోడల మధ్య ఇరుక్కుపోయి నరకయాతన అనుభవించిన చిన్నారులు

Two children get stuck in between narrow walls
  • తాడేపల్లిలో ఘటన
  • బడి గోడల మధ్య చిన్నారులు
  • కాపాడిన స్థానికులు
  • చిన్నారులకు చిన్నపాటి గాయాలు
ఇద్దరు చిన్నారులు గోడ మధ్య ఇరుక్కుపోయిన ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లిలో నూకలపేట ఉర్దూ పాఠశాలలో చోటు చేసుకుంది. ఆడుకుంటోన్న సమయంలో గోడల మధ్యలోకి వెళ్లిపోయిన చిన్నారులు తిరిగి బయటకు రాలేకపోయారు. దీంతో గట్టిగా ఏడవడం మొదలుపెట్టారు. వారిని గోడ సందుల్లోంచి తీసుకురావడం అక్కడున్న వారికి మొదట సాధ్యపడలేదు.
           
రెండు గోడల మధ్య శ్వాస ఆడక చిన్నారులు నరకయాతన అనుభవించారు. స్థానికులు, పాఠశాల సిబ్బంది మరికొంత మంది వచ్చి చివరకు వారిని బయటకు తీశారు. పోలీసులు కూడా అక్కడకు చేరుకున్నారు. చిన్నపాటి గాయాలతో వారు బయట పడడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఆ పిల్లలిద్దరూ తమ స్కూల్‌ విద్యార్థులు కాదని పాఠశాల సిబ్బంది చెప్పారు. ఆ పిల్లల తల్లిదండ్రులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు.
Guntur District

More Telugu News