Tamilnadu: తమిళనాడులో షూటింగ్‌ సెట్‌లో మరో ప్రమాదం

fire in tamilnadu shooting set
  • దాదాపు రూ.20 లక్షల నష్టం 
  • వేలాయుధం కాలనీలోని పారామౌంట్‌ స్టూడియోలో ఘటన
  • మంటలను అదుపులోకి తీసుకొచ్చిన ఫైరింజన్ సిబ్బంది 
తమిళనాడులో భారతీయుడు-2 సినిమా షూటింగ్‌లో జరిగిన భారీ ప్రమాదం మరవక ముందే మరోసారి అదే రాష్ట్రంలో మరో ప్రమాదం జరిగింది. షూటింగ్‌ సెట్‌లో మంటలు చెలరేగి దాదాపు రూ.20 లక్షల నష్టం వచ్చింది. వేలాయుధం కాలనీలోని పారామౌంట్‌ స్టూడియో వెనుక భాగంలో మంటలు చెలరేగిన విషయాన్ని గమనించిన వాచ్‌మన్‌ వెంటనే ఫైరింజన్‌ సిబ్బందికి ఫోన్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది.

రెండు అగ్నిమాపక దళాలు వెంటనే అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. దాదాపు రెండు గంటల పాటు అక్కడి వస్తువులు అగ్నిలో కాలిపోయాయి. సినిమా కోసం వేసిన సెట్, సామగ్రి కాలిపోయినట్లు అక్కడి సిబ్బంది మీడియాకు వివరించారు.



Tamilnadu
Fire Accident

More Telugu News