Rashmika Mandanna: సినిమా స్టిల్ కాదు... రష్మిక ఫ్యామిలీ ఫొటో ఇది!

Rashmika Family pic went Viral
  • తల్లి, తండ్రి, చెల్లితో రష్మిక ఫోటో
  • రష్మికకు 15 సంవత్సరాల చిన్న చెల్లి
  • వైరల్ అవుతున్న పిక్
రాజ వంశీకునిగా ఈ చిత్రంలో తలపై పాగా, నడుమున కత్తి పెట్టుకుని ఓ వ్యక్తి నిలబడి ఉన్నాడు చూశారా? అతను టాలీవుడ్ బ్యూటీ రష్మిక తండ్రి మదన్ మందన. రష్మికకు ఎడమవైపున ఉన్నది ఆమె తల్లి సుమన్ మందన. ఇక రష్మిక చంకనెక్కి దర్జాగా కూర్చుని ఉన్నది ఎవరో తెలుసా? రష్మిక చెల్లి శిమన్. ఏదో సినిమా షూటింగ్ స్టిల్ మాదిరిగా కనిపిస్తున్న ఈ స్టిల్ ను రష్మిక ఫ్యాన్స్ కు చూపింది. ఆమె చెల్లి శిమన్ కు బహుశా ఆరేడు సంవత్సరాలు ఉండవచ్చు.

ఈ లేటెస్ట్ చిత్రాన్ని రష్మిక, తన సోషల్ మీడియా ఖాతాలో అభిమానులతో షేర్ చేసుకుంది. ఈ ఫొటో వైరల్ కాగా, ఫ్యాన్స్ నుంచి తెగ కామెంట్లు వచ్చేస్తున్నాయి. 23 సంవత్సరాల వయసున్న రష్మికకు ఇంత చిన్న చెల్లా? అన్నది వాటిల్లో హైలైట్. టాలీవుడ్ లోకి 'ఛ‌లో' సినిమాతో ప్రవేశించి, ఆపై 'గీత గోవిందం'తో స్టార్ డమ్ ను పొందిన రష్మిక, ఇప్పుడు టాప్ హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది.
Rashmika Mandanna
Family Pic
Viral

More Telugu News