Roja: చంద్రబాబును అడ్డుకున్నది రౌడీలని టీడీపీ నేతలు నిరూపిస్తే నా పదవికి రాజీనామా చేస్తా: ఎమ్మెల్యే రోజా సవాల్​

Ysrcp mla Roja challenges Tdp leaders
  • చంద్రబాబును అడ్డుకుంది ఉత్తరాంధ్ర ప్రజలే
  • ఉత్తరాంధ్ర అభివృద్ధికి అడ్డుపడుతున్న బాబుకు స్వాగతమా?
  •  సీఎం జగన్ ని విమర్శించే అర్హత లోకేశ్ కు లేదు
విశాఖలో చంద్రబాబును పులివెందుల రౌడీలు, వైసీపీ నేతలు అడ్డుకున్నారన్న ఆరోపణలపై ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా ఘాటుగా స్పందించారు. చంద్రబాబును రౌడీలు అడ్డుకున్నారని టీడీపీ నేతలు నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని రోజా సవాల్ విసిరారు.

చంద్రబాబును అడ్డుకున్నది ఉత్తరాంధ్ర ప్రజలేనని, అక్కడి అభివృద్ధికి అడ్డుపడుతున్న బాబుకు స్వాగతం ఎలా పలుకుతారని ప్రశ్నించారు. నాడు టీడీపీ హయాంలో జరిగిన మహిళా సదస్సుకు వెళ్తే ఎయిర్ పోర్టులోనే తనను అడ్డుకున్న సంఘటనను ఆమె ప్రస్తావించారు. ఈ సందర్భంగా నారా లోకేశ్ పై విమర్శలు చేశారు. సీఎం జగన్ ని విమర్శించే అర్హత లోకేశ్ కు లేదని అన్నారు.
Roja
YSRCP
Chandrababu
Telugudesam
vizag
Nara Lokesh

More Telugu News