Botsa Satyanarayana: పెళ్లికి వెళుతూ కావాలనే ఇంత హడావుడి చేశారు: చంద్రబాబుపై బొత్స విసుర్లు

Botsa slams TDP President Chandrababu
  • విశాఖలో చంద్రబాబు తీరు సరికాదన్న బొత్స
  • ఎయిర్ పోర్టు పరిణామాలతో వైసీపీకి సంబంధం లేదని స్పష్టీకరణ
  • రాయలసీమ వెళ్లినా బాబుకు ఇదే పరిస్థితి ఎదురవుతుందని వ్యాఖ్యలు
నిన్న విశాఖ ఎయిర్ పోర్టు వద్ద టీడీపీ అధినేత చంద్రబాబు ప్రవర్తించిన తీరు సరికాదని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. విశాఖలో జరిగిన ఘటనలకు వైసీపీ కారణమంటూ ఆరోపణలు చేస్తున్నారని, ఆ ఘటనలతో తమకు ఎలాంటి సంబంధం లేదని బొత్స స్పష్టం చేశారు. ఓ పెళ్లికి వెళుతూ చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా చేసిన హడావుడి తప్ప ఇది మరొకటి కాదన్నారు.

ఉత్తరాంధ్ర ప్రజలను కించపరిచేలా మాట్లాడిన చంద్రబాబుకు అక్కడి ప్రజలు స్వాగతం పలుకుతారా? రాయలసీమ వెళ్లినా చంద్రబాబు ఇదే పరిస్థితి ఎదుర్కోక తప్పదు అని వ్యాఖ్యానించారు. కాగా, చంద్రబాబు విశాఖలో పార్టీ ముఖ్యనేత అయ్యన్నపాత్రుడి కుమారుడి వివాహానికి హాజరవ్వాల్సి ఉంది. అయితే తీవ్ర నిరసనల కారణంగా చంద్రబాబును పోలీసులు విశాఖ నుంచి హైదరాబాద్ పంపించేశారు.
Botsa Satyanarayana
Chandrababu
Vizag
YSRCP
Telugudesam
Andhra Pradesh

More Telugu News