Sonu Sood: చిరు తాజా చిత్రంలో సోనూసూద్ కి ఛాన్స్ ​

Sonu Sood to be part of Chiranjeevi 152nd film
  • కీలక పాత్ర దక్కించుకున్న బాలీవుడ్ నటుడు
  • కొరటాల శివ డైరెక్షన్లో రూపొందుతున్న మూవీ
  • తమిళ, హిందీ సినిమాలలో కూడా నటిస్తున్న సోనూసూద్
బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న నటుడు సోనూసూద్ ఓ క్రేజీ ఆఫర్ కొట్టేశాడు. మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమాలో అతనికి ఓ కీలక పాత్ర దక్కింది. కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. చిరుతో కలిసి నటిస్తున్న విషయాన్ని సోనూ తాజాగా ధ్రువీకరించాడు. చిరుతో తెర పంచుకోవడం తనకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపాడు. దక్షిణాది చిత్రసీమ తనను అక్కున చేర్చుకుంటోందన్నాడు. వాళ్లు చూపించే ప్రేమకు ఈ సినిమాతో ఎంతో కొంత తిరిగి ఇవ్వాలని అనుకుంటున్నట్టు తెలిపాడు. సోనూ ప్రస్తుతం తమిళలో 'తమిలరసన్' అనే సినిమాతో పాటు బాలీవుడ్‌లో అక్షయ్ కపూర్‌‌తో కలిసి 'పృథ్వీరాజ్' అనే మూవీలో నటిస్తున్నాడు.
Sonu Sood
Chiranjeevi
152 movie
Koratala Siva

More Telugu News