Jagan: జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణ మార్చి 6కు వాయిదా!

Jagan property case trail to march 6
  • ఈరోజు సీబీఐ, ఈడీ కోర్టులో కేసు విచారణ
  • కోర్టుకు హాజరైన ఇతర నిందితులు
  • ప్రతి శుక్రవారం కోర్టులో విచారణ
జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ కేసుకు సంబంధించి ప్రతి శుక్రవారం హైదరాబాద్‌లోని సీబీఐ, ఈడీ కోర్టుల్లో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఏపీ సీఎం జగన్‌తోపాటు పలువురు ప్రముఖులు ఈ కేసులో నిందితులుగా విచారణ ఎదుర్కొంటున్నారు. కాగా, ఈరోజు కోర్టులో జరిగిన విచారణకు తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, శ్యాంప్రసాద్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. న్యాయమూర్తి కేసు విచారణ ప్రారంభించిన అనంతరం తదుపరి విచారణ మార్చి 6వ తేదీకి వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
Jagan
YSRCP
CBI

More Telugu News