Vijayawada: జగన్‌ రౌడీయిజానికి భయపడం...జగదాంబా సెంటర్లో తేల్చుకుందాం రా: బోండా ఉమ సవాల్‌

We donot care Jagan strategy says bonda uma
  • త్వరలోనే చంద్రబాబు విశాఖ వస్తారు
  • దమ్ముంటే మళ్లీ అడ్డుకోండి
  • విశాఖ భూముల బాగోతం బయటపెడతారనే కదా సీఎం భయం

  వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి రౌడీయిజానికి ఇక్కడ భయపడే వారు ఎవరూ లేరని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ సవాల్‌ విసిరారు. జగన్‌కు దమ్ముంటే జగదాంబా సెంటర్‌కు రావాలని, అక్కడే తేల్చుకుందామని సవాల్ విసిరారు. నిన్న విశాఖ పర్యటనకు వచ్చిన చంద్రబాబును వైసీపీ శ్రేణులు విమానాశ్రయంలోనే అడ్డుకున్న నేపథ్యంలో ఈరోజు ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు.

చంద్రబాబునాయుడు విశాఖలో పర్యటిస్తే అక్కడి తన భూ బాగోతాలు బయటపెడతారన్న భయంతోనే జగన్‌ ఇలా చేయించారని ఆరోపించారు. పోలీసుల అండతో నిన్న రౌడీయిజం చేశారని, ఇలాంటి వాటికి భయపడమని, త్వరలోనే చంద్రబాబు మళ్లీ విశాఖలో పర్యటిస్తారని, అప్పుడు ఎలా అడ్డుకుంటారో చూస్తామని సవాల్‌ విసిరారు. కాగా, నిన్న విశాఖ ఘటనపై కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయనున్నట్లు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News