Congress: పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభకు ఏచూరి.. ప్రతిపాదించిన పార్టీ

Sitaram Yechury to contest Rajya Shaba from West Bengal
  • వచ్చే నెల 26న ఐదు స్థానాలకు ఎన్నికలు
  • నాలుగు స్థానాలకు పోటీపడుతున్న టీఎంసీ
  • కాంగ్రెస్ మద్దతుతో పోటీపడనున్న సీపీఎం
వచ్చే నెల 26న పశ్చిమ బెంగాల్‌లో ఐదు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని బరిలోకి దింపాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ ఆయన పేరును ప్రతిపాదించింది. ఈ విషయంలో ఏచూరికి మద్దతుగా నిలవాల్సిందిగా కాంగ్రెస్‌ను కోరనుంది. అయితే, ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సమాచారం.

మరోవైపు, నాలుగు స్థానాల నుంచి టీఎంసీ బరిలోకి దిగుతుండగా, సీపీఎం-కాంగ్రెస్ కానీ, టీఎంసీ-కాంగ్రెస్ కానీ ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, కాంగ్రెస్‌తో కలిసి ఏచూరిని నిలబెట్టాలని సీపీఎం భావిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఎనిమిదిమంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న బీజేపీకి రాజ్యసభకు పోటీ పడే అవకాశం లేదని సమాచారం.
Congress
sitaram yechury
CPM
Rajya Sabha
West Bengal

More Telugu News