Devineni Uma: చంద్రబాబును అడ్డుకుంటామని మంత్రులు చెప్పడం దారుణం: దేవినేని ఉమ

Devineni Uma reacts over attack on Chandrababu convoy
  • వైసీపీ మంత్రులపై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామన్న ఉమ
  • మంత్రులను బర్తరఫ్ చేయాలని డిమాండ్
  • వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోందని వ్యాఖ్యలు
విశాఖపట్నంలో టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్ పై కోడిగుడ్లు, రాళ్లు, చెప్పులతో దాడికి యత్నించడం పట్ల మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు కాన్వాయ్ పై దాడి అంశంపై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామని అన్నారు. చంద్రబాబును అడ్డుకుంటామని మంత్రులు అనడం దారుణమని పేర్కొన్నారు. గవర్నర్ తక్షణమే వైసీపీ మంత్రులను బర్తరఫ్ చేయాలని కోరారు. వైసీపీపై రాష్ట్రంలో ప్రజావ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని, ప్రజాగ్రహంలో ఈ ప్రభుత్వం కొట్టుకుపోతుందని వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో టీడీపీ రాస్తారోకో సందర్భంగా దేవినేని ఉమను, జీవీ ఆంజనేయులును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఉమ పైవ్యాఖ్యలు చేశారు.
Devineni Uma
Chandrababu
YSRCP
Governor
Andhra Pradesh

More Telugu News