Chandrababu: చంద్రబాబు కాన్వాయి పైకి కోడిగుడ్లు, చెప్పులు.. వాహనం దిగి నడుస్తూ వెళ్లిన టీడీపీ అధినేత

chaos in chandrababu toor in vizag toor
  • విశాఖలో చంద్రబాబు పర్యటన
  • ఎయిర్‌పోర్టు వద్ద ఉద్రిక్తత
  • కాన్వాయి ముందు పడుకున్న వైసీపీ కార్యకర్తలు
విశాఖపట్నంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటిస్తోన్న నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. అధికార వైసీపీ కార్యకర్తల తీరుతో చంద్రబాబు కాన్వాయి ముందుకు కదిలే పరిస్థితి కనపడలేదు. దాదాపు రెండు గంటల పాటుగా ఆయన కాన్వాయిలోనే నిరీక్షించారు. వేలాదిగా వైసీపీ, టీడీపీ కార్యకర్తలు విమానాశ్రయ ప్రాంతానికి తరలివచ్చారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట కొనసాగింది. వైసీపీ కార్యకర్తలు చంద్రబాబు వాహనంపై కోడిగుడ్లు, చెప్పులు విసిరారు. కొందరు చెప్పులు చూపెడుతూ నినాదాలు చేశారు.

చంద్రబాబు కాన్వాయికి కొందరు వైసీపీ కార్యకర్తలు అడ్డంగా పడుకున్నారు. అది ముందుకు కదలకపోతుండడంతో వాహనం దిగిన చంద్రబాబు నడుచుకుంటూ ముందుకు కదిలారు. అనంతరం మళ్లీ వాహనంలోకి ఎక్కారు. ఆయన కాన్వాయ్‌ మెల్లిగా ముందుకు కదులుతోంది. ప్రజా చైతన్య యాత్ర చేపట్టి తీరుతామని టీడీపీ నేతలు అంటున్నారు.  
Chandrababu
Telugudesam
YSRCP

More Telugu News