Suma: మరి దారి లేదు.. కిటికీలోంచి దూరి ఈవెంట్ హాలులోకి వెళ్లిన యాంకర్‌ సుమ.. వీడియో వైరల్‌

Anchor Suma  caught sneaking through window with full make up and costume video goes viral
  • ఓ ఈవెంట్‌లో పాల్గొన్న సుమ
  • నిండిపోయిన హాల్‌
  • మెయిన్‌డోర్‌ నుంచి వెళ్లేందుకు నో ఛాన్స్‌
  • వెనకనుంచి వెళ్లిన సుమ

టాప్ యాంకర్ సుమ ఓ ఈవెంట్‌కు కిటికీలోంచి దూరి లోపలికి వెళ్లిన వీడియో బయటకు వచ్చింది. ఫుల్ మేకప్ వేసుకుని, చక్కగా తయారై ఆమె.. ఇలా కిటికీలోంచి లోపలికి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందన్నదానికి కారణాలు ఉన్నాయి. ఆమె పాల్గొనబోతున్న ఆ ఈవెంట్‌ హాల్ ప్రేక్షకులతో నిండిపోయింది.

తలుపు వద్ద నుంచి వెళ్లడానికి కూడా దారి లేకుండా పోయింది. దీంతో ఆమె చేసేది లేక కిటికీ ఎక్కి లోపలికి వెళ్లింది. ఆమె కిటికీలోకి దూరడానికి సెక్యూరిటీ సిబ్బంది సాయం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఒకరు తమ మొబైల్‌ ఫోన్‌లో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. కిటికీలోంచి వెళ్లి ఈవెంట్‌లో యాంకర్‌ సుమ అందరికీ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది.

  • Loading...

More Telugu News