Congress: ఢిల్లీకి వెళ్లి సోనియా, ప్రియాంకతో చర్చించిన నవజ్యోత్ సింగ్ సిద్ధు

Congress leader Navjot Singh Sidhu called to Delhi by party high command
  • ఢిల్లీ నుంచి మా అధిష్ఠానం నన్ను పిలిచింది
  • ఫిబ్రవరి 25, 26 తేదీల్లో నేను సోనియా జీ, ప్రియాంక జీని కలిశాను
  • పంజాబ్‌లోని ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్‌ కార్యాచరణపై వివరించాను
పంజాబ్‌ కాంగ్రెస్‌ నేత నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధు నిన్న, మొన్న ఢిల్లీలో తమ పార్టీ అధిష్ఠానంతో సమావేశమయ్యారు. పంజాబ్‌ మంత్రి పదవికి నవజ్యోత్ సింగ్ సిద్ధు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్‌తో ఆయనకు విభేదాలున్నాయని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఢిల్లీకి ఆయన వెళ్లడం చర్చనీయాంశమైంది.

'ఢిల్లీలోని మా పార్టీ అధిష్ఠానం నన్ను పిలిచింది. ఫిబ్రవరి 25, 26 తేదీల్లో నేను సోనియా జీ, ప్రియాంక జీని కలిశాను. పంజాబ్‌లోని ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్‌ కార్యాచరణపై వారికి నేను వివరించాను' అని నవజ్యోత్‌ సింగ్‌ ఈ సందర్భంగా తెలిపారు.  
Congress
New Delhi
Sonia Gandhi
Priyanka Gandhi

More Telugu News