ICC Women T20: మహిళల టీ20 ప్రపంచకప్.. రసవత్తర పోరుకు సిద్ధమైన ఇండియా-కివీస్

New zealand won toss and elected to field
  • టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కివీస్
  • గెలిస్తే సెమీస్‌కు హర్మన్‌ప్రీత్ కౌర్ సేన
  • దీప్తిశర్మపై ఆశలు
మహిళల టీ20 ప్రపంచకప్‌లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. వరుస విజయాలతో ఊపు మీదున్న హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు కివీస్‌తో పోరుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత జట్టుకు సెమీస్ బెర్త్ ఖాయమైనట్టే. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కివీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది.

ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌లను చిత్తు చేసిన భారత జట్టుకు నేటి మ్యాచ్ కొంచెం టఫ్ ఫైటే. అన్ని రంగాల్లోనూ బలంగా ఉన్న కివీస్‌ను నిలువరించడం కొంచెం కష్టంతో కూడుకున్న పనే. మరోవైపు భారత్‌ కూడా అటు బౌలింగ్‌లోనూ, ఇటు బ్యాటింగులోనూ సత్తా చాటుతోంది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు దూరమైన స్మృతి మంధాన ఈ మ్యాచ్‌లో తిరిగి జట్టులోకి రావడం భారత్‌కు అనుకూలించే విషయం. ఇక బౌలింగ్‌లో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్న దీప్తి శర్మ ఈ మ్యాచ్‌లోనూ చెలరేగాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ICC Women T20
India
Kiwis

More Telugu News