UGC: జగన్ నిర్ణయానికి బ్రేక్ వేసిన యూజీసీ

UGC disagrees Jagans decesion
  • నాలుగేళ్ల డిగ్రీ, ఐదేళ్ల ఇంజినీరింగ్ కోర్సులను ప్రవేశపెట్టాలని భావించిన సీఎం
  • జాతీయ విద్యా విధానానికి భిన్నంగా నిర్ణయాలు తీసుకోరాదన్న యూజీసీ
  • తమ విధానానికి లోబడే కోర్సుల కాల వ్యవధి ఉండాలని స్పష్టీకరణ
ఏపీలో వచ్చే ఏడాది నుంచి నాలుగేళ్ల డిగ్రీ, ఐదేళ్ల ఇంజినీరింగ్ కోర్సులను ప్రవేశపెట్టాలని భావించిన ముఖ్యమంత్రి జగన్ నిర్ణయానికి యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ)లు బ్రేక్ వేశాయి. జాతీయ విద్యా విధానానికి భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకోకూడదని స్పష్టం చేశాయి. జాతీయ విద్యా విధానానికి లోబడే కోర్సుల కాల వ్యవధి ఉండాలని తేల్చి చెప్పాయి. దీంతో, ఏపీలో ఇప్పటి వరకు ఉన్న విధానమే కొనసాగనుంది.

UGC
AICTE
Jagan
YSRCP
Cources

More Telugu News