YSRCP: ఏపీ సీఎం జగన్‌పై అసభ్యకర పోస్టు.. కడప జిల్లా వ్యక్తిపై కేసు

Case filed against one for TikTok Video on YS Jagan
  • జగన్‌పై అసభ్యకరంగా టిక్‌టాక్ వీడియో
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన వైసీపీ నేత
  • దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టు చేశారంటూ ఓ వ్యక్తిపై కేసు నమోదైంది. కడప జిల్లా పోలీసుల కథనం ప్రకారం.. మైదుకూరుకు చెందిన పుల్లయ్య, సీఎం జగన్‌ను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడుతూ టిక్‌టాక్ చేసినట్టు దువ్వూరు మండలంలోని పెద్దజొన్నవరానికి చెందిన వైసీపీ నేత కానాల జయచంద్రారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
YSRCP
YS Jagan
TikTok
Kadapa District

More Telugu News