Daggubati Suresh: సీఎం జగన్ ను కలిసిన టాలీవుడ్ నిర్మాతలు దగ్గుబాటి సురేశ్, శ్యాంప్రసాద్ రెడ్డి

Tollywood producers Daggubati suresh and Shyamprasad met CM Jagan
  • హుద్ హుద్ తుపాను బాధితుల కోసం నిధులు సేకరించామన్న నిర్మాతలు
  • ఆ నిధులతో ఇళ్ల నిర్మాణం చేపట్టామని వెల్లడి
  • ఇళ్ల ప్రారంభోత్సవానికి రావాలంటూ సీఎం జగన్ కు ఆహ్వానం
టాలీవుడ్ నిర్మాతలు దగ్గుబాటి సురేశ్, శ్యాంప్రసాద్ రెడ్డి ఏపీ సీఎం జగన్ ను కలిశారు. గతంలో హుద్ హుద్ తుపాను వచ్చినప్పుడు భారీగా విరాళాలు సేకరించి, దాదాపు రూ.15 కోట్లతో బాధితులకు ఇళ్లు నిర్మించామని సీఎంకు తెలిపారు. ఇప్పుడు ఆ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాలంటూ ఆయనను ఆహ్వానించారు. దీనిపై సీఎం స్పందన తెలియరాలేదు. కాగా, అప్పట్లో హుద్ హుద్ తుపాను సంభవించిన సమయంలో విశాఖ జిల్లా తీవ్రంగా నష్టపోయింది. లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఆ తర్వాత క్రమంగా అక్కడ సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయి.
Daggubati Suresh
Shyamprasad
Jagan
HudHud
Cyclone
Houses
Visakhapatnam District

More Telugu News