మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రవితేజ

Krack Movie
  • 'క్రాక్' సినిమాతో బిజీగా రవితేజ 
  • కొత్త కథతో మెప్పించిన నక్కిన 
  •  లైన్లో 'రాక్షసుడు' దర్శకుడు  
ప్రస్తుతం రవితేజ 'క్రాక్' సినిమా చేస్తున్నాడు. 'ఠాగూర్' మధు నిర్మిస్తున్న ఈ సినిమాకి గోపీచంద్ మలినేని దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకమైన పాత్రను పోషిస్తోంది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే దర్శకుడు రమేశ్ వర్మకు రవితేజ ఓకే చెప్పేశాడు. కోనేరు సత్యనారాయణ ఈ సినిమాను నిర్మించనున్నాడు. ఈ మధ్య హిట్ కొట్టిన బెల్లంకొండ సినిమా 'రాక్షసుడు' దర్శకుడు రమేశ్ వర్మనే.

ఈ సినిమాతో పాటు రవితేజ మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ దర్శకుడు పేరే నక్కిన త్రినాథరావు. 'సినిమా చూపిస్త మావ' .. 'నేను లోకల్' .. 'హలో గురు ప్రేమకోసమే' వంటి యూత్ ఫుల్ ఎంటర్టైనర్లు ఆయన నుంచి వచ్చినవే. ఆయన ట్రాక్ రికార్డ్ చూసే రవితేజ ఓకే అనేశాడట. ఈ సినిమాకి విశ్వప్రసాద్ - వివేక్ కూచిభొట్ల నిర్మాతలుగా వ్యవహరించనున్నట్టు తెలుస్తోంది. రమేశ్ వర్మ ప్రాజెక్టు కంటే ముందే త్రినాథరావు ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశాలు వున్నాయనే టాక్ వినిపిస్తోంది.
Go Back to Shorts
Raviteja
Nakkina Trinatha Rao
Ramesh varma
Krack Movie

More Telugu News