ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగిని చంపి, శవాన్ని కాలువలో పడేసిన అల్లరిమూక!
- ఇంటెలిజెన్స్ బ్యూరోలో డ్రైవర్ గా పని చేస్తున్న అంకిత్ శర్మ
- విధులు ముగించుకుని వస్తుండగా అల్లరి మూక దాడి
- శర్మ శరీరంపై బుల్లెట్ గాయాలు
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... విధులు నిర్వహించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా అల్లరిమూక శర్మపై దాడి చేసింది. ఆయనను హతమార్చి, పక్కనే ఉన్న మురికి కాల్వలో పడేసింది. అతని శరీరంపై బుల్లెట్ గాయాలు ఉన్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. మరోవైపు, అంకిత్ శర్మ హత్య నేపథ్యంలో ఢిల్లీలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.