Narendra Modi: ఢిల్లీ హింసపై తొలిసారి స్పందించిన ప్రధాని మోదీ

 working on the ground to ensure peace and normalcy says modi
  • శాంతి, సామరస్యాలే మన దేశ లక్షణాలు
  • ఎల్లవేళలా శాంతి, సోదరభావాలను పాటించాలి 
  • ఢిల్లీలో పోలీసులు, ఇతర ఏజెన్సీలు పనిచేస్తున్నాయి 
ఈశాన్య ఢిల్లీలో హింస కలకలం రేపుతోంది. దీనిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. 'శాంతి, సామరస్యాలే మన దేశ లక్షణాలు. ఎల్లవేళలా శాంతి, సోదరభావాలను పాటించాలని ఢిల్లీలోని నా సోదరసోదరీమణులను నేను కోరుతున్నాను' అని ట్వీట్ చేశారు. ఢిల్లీలో వీలైనంత త్వరగా సాధారణ పరిస్థితులు తిరిగి నెలకొనడం చాలా ముఖ్యమని చెప్పారు.

ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో కొనసాగుతోన్న హింసపై తాను సమీక్ష నిర్వహించానని మోదీ చెప్పారు. ఢిల్లీలో సాధారణ పరిస్థితులు తీసుకురావడానికి పోలీసులు, ఇతర ఏజెన్సీలు పనిచేస్తున్నాయని తెలిపారు. కాగా, భారీగా పోలీసులు మోహరించినప్పటికీ హింస ఆగడం లేదు. రాళ్ల దాడితో ఆందోళనకారులు విధ్వంసం సృష్టిస్తున్నారు.  
Narendra Modi
BJP
New Delhi

More Telugu News